Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మునుగోడు పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. మునుగోడుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన విషయం విదితమే.