Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: పుదుచ్చేరిలో మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన లక్ష్మి అనే ఏనుగు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందింది. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుందని ఆలయ సిబ్బంది తెలిపారు. లక్ష్మి మరణవార్త తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఏనుగు పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. 1995లో ఓ వ్యాపారవేత్త లక్ష్మి అనే ఈ ఏనుగును వినాయక ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎంతో ఆదరణ పొందింది. విదేశీ భక్తులు కూడా లక్ష్మి ఆశీర్వదాలు తీసుకుని సంబరపడిపోయేవారు.