Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన నవంబరు మాసం వివరాలను కేంద్రం ఓ ప్రకటనలో తెలియజేసింది. దాదాపు నవంబరు మాసంలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. గతేడాది నవంబరులో వసూలైన జీఎస్టీ కంటే ఇది 11 శాతం అధికం. వరుసగా 9వ నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు.
నవంబరు మాసం జీఎస్టీ వసుళ్ళయినవి కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) రూ.25,681 కోట్లు, రాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఎస్జీఎస్టీ) రూ.32,651 కోట్లు, సమీకృత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.77,103 కోట్లు (దిగుమతులపై రూ.38,635 కోట్లతో కలిపి), సెస్ రూపేణా వసూలైన మొత్తం రూ.10,433 కోట్లు (దిగుమతులపై రూ.817 కోట్లతో కలిపి) అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.