Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని గొల్లపల్లి బస్‌స్టేజీ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు ఘోరం ప్రామాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుడి అన్న అయిన మరో బాలుడు, వారి నాన్నమ్మ గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం బోడపోతుల రాజాగౌడ్, శశికళ దంపతులకు అభిలాష్ (9), రిత్విక్ (7) కుమారులు. చేవెళ్లలోని ఓ ప్రయివేటు స్కూల్లో చదువుతున్నారు.
స్కూలు బస్సు కోసం బస్టాప్ వద్ద ఎదురుచూస్తుండగా కాసేపటికి చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ టిప్పర్ అదుపు తప్పి బస్‌స్టాప్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై అదే వేగంతో రోడ్డు పక్కన నిల్చున్న రిత్విక్‌పై నుంచి వెళ్లింది. లారీ చక్రాలు మీద నుంచి వెళ్లడంతో ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో యాదమ్మ, అభిలా్‌షకు గాయాలయ్యాయి. తమ కళ్లెదుటే విద్యార్థి లారీచక్రాల కింద నలిగిపోవడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాద ఘటనను నిరసిస్తూ చేవెళ్ల-శంకర్‌పల్లి రోడ్డుపై గొల్లపల్లి గ్రామస్థులు రెండు గంటలపాటు ధర్నా చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై స్పీడు బ్రేకర్లు వేయాలని, మలుపుల వద్ద రేడియం స్టికర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనాస్థలికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రూ.50 వేల సాయాన్ని అందజేశారు.