Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కి చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తప్పించుకున్న బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.