Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేష్ వికె, పవిత్ర లోకేష్ జంటగా ఎమ్ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ, 'ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుండాలి. అది సినిమాకే కాదు జీవితం కూడా అలాగే ఉండాలని అనుకుంటాం. ఇది ప్రపంచ సమస్య. దీనిపైనే ఓ సినిమా తీయాలనుకుని చేసిందే ఈ సినిమా అని అన్నారు.' అని తెలిపారు.
'ట్రైలర్, టీజర్ చూశారు. ఇది మచ్చు తునక మాత్రమే, సినిమాలో చాలా విషయం ఉంది. ఈ కథకు టైటిల్ ఏం పెట్టాలని అనుకున్నప్పుడు గతంలో కృష్ణ, విజయనిర్మల నటించిన 'మళ్ళీ పెళ్లి' గుర్తుకువచ్చి, అదే టైటిల్ పెట్టాలనిపించింది. గౌరవప్రదమైన సినిమా తీశాం. గొప్ప అనుభూతిని మీకు అందిస్తాం. అయితే ఇది నా బయోపిక్ కాదు' అని నరేష్ చెప్పారు. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ, 'విజయకష్ణ ఫిలింస్ బేనర్లో సినిమాలు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవిధంగా ఉంటాయి. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం' అని అన్నారు.