Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజమౌళి గారూ మీకిది తగునా! | షో | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • షో
  • ➲
  • స్టోరి
  • Apr 03,2022

రాజమౌళి గారూ మీకిది తగునా!

           1897లో జన్మించిన అల్లూరి సీతారామరాజు, 1901లో పుట్టిన కొమురం భీమ్‌ ఇద్దరూ సమకాలీకులే. ఇద్దరూ కూడా నైజాం అయినా, బ్రిటీష్‌ అయినా నిరంకుశ పాలనాధిపత్య క్రూర అణచివేతపై గెరిల్లా సాయుధ పోరులో ప్రాణాలు అర్పించిన వారే. కొమురం భీమ్‌ గోండు ఆదివాసీ నేతగా, 'జల్‌, జంగల్‌, జమీన్‌' స్వయం ప్రతిప్తి సాధించే పోరాటంలో తెలంగాణ ఆదిలాబాద్‌ జోడేఘాట్‌ అడవులలో, అసఫ్‌జాహి నైజామ్ల దుష్టత్వ పాలనకు మద్దతుగా వున్న బ్రిటీష్‌ మూకలను ప్రతిఘటించడానికి తుపాకి పట్టవలసి వచ్చింది. 12 గిరిజన గ్రామాలను సంఘటిత పరిచే బాభేజరి పోరాటానికి గోండు బెబ్బులి, 'భీమ్‌' పరాక్రమించాడు. అదే విధంగా, కిరాకత బ్రిటీష్‌ పాలన కారణంగా దోపిడీకి గురి అవుతున్న మన్యం సీమ నిస్సహాయ ఆదివాసీల విముక్తికి అల్లూరి తుపాకులతో సాయుధ సమరం చేపట్టారు. అంతర్గతంగా గోండు ఆదివాసీలు, మన్యం గిరిజనులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన కోసం కొనసాగిన విముక్తి సాయుధ పోరాటాలవి. అల్లూరి 1924 వరకు 27 ఏళ్లు జీవించారు. కాని ఇద్దరి పుట్టుక, పెరుగుదల, బాల్య యౌవన కుటుంబ నేపథ్యాలు, ప్రాంతాలు వేర్వేరు కావటంతో ఒకరితో ఒకరికి సాన్నిహిత్యం వున్న చారిత్రక వాస్తవాలు లేవు. అమాయక, నిస్సహాయ ఆదివాసీలను సామాజికంగా, ఆర్థికంగా దోపిడీ చేస్తున్న నిరంకుశ పాలనా వ్యవస్థను పారద్రోలటం అనే లక్ష్యం ఇద్దరికీ ఒక్కటే.
కొమురంభీమ్‌, సమరయోధత్వంతో ఆదివాసీలు జీవించే హక్కులను దోచుకుంటున్న అత్యంత క్రూరుడైన భూ దురాక్రమణదారుడు, నైజాం దుష్టపాలనా ప్రతినిధి సిద్ధిక్‌ని సంహరించటం అదేవిధంగా అల్లూరి, బ్రిటీష్‌ సైనికాధికారులైన స్కాట్‌ కవర్ట్‌, హైటర్‌లను కాల్చి చంపటం నాటి గెరిల్లా పోరాట ఘట్టాలు. గోండు ఆదివాసీ కుర్దూపటేల్‌, నమ్మక ద్రోహం కారణంగా కొమురంభీమ్‌ కాల్చి చంపబడితే (1940 అక్టోబరు), అల్లూరి సీతారామరాజు మన్యం సీమలో క్రూర మిలటరీ అధికారులు మన్యం సీమను అగ్ని గుండంగా మార్చి వేయడంతో స్వచ్ఛందంగా లొంగి మేజర్‌ గుడాల్‌ కిరాతకంగా తుపాకి కాల్పుకు బలి అయి ఇద్దరూ త్యాగమయ, సాహిసిక చరిత్ర సృష్టించారు. (1924 మే).
           ఇక వ్యక్తిగత జీవితాలు పరిశీలిస్తే, శ్రీరామరాజు జీవించిన 27 ఏళ్ళల్లో, 16వ ఏట నుంచి 11 సంవత్సరాలు కఠోర యువ తపస్విగా, విప్లవ తేజస్విగా జీవించారు. సీత ప్రేమాకర్షణ కథ, సీతారామరాజుగా పేరు మార్చుకొన్న అంశానికి సంబంధించి రూఢ వృత్తాంతం లేదు. కాషాయ వస్త్రాలు ధరించలేదు. మన్యం పోరాట కాలంలో తన పేరు శ్రీరామరాజుగా తానే రాసుకొన్న ఉత్తరాలు లభ్యమయ్యాయి. గోండు ఆదివాసీ సంప్రదాయ కుటుంబానికి చెందిన కొమురం భీమ్‌ సోంబాయి, అనంతరం మరొక ఆదివాసీ మహిళను వివాహం చేసుకున్నారు. బహు భార్యత్వం ఆదివాసీల ఆచార వ్యవహారాలలో తప్పు కాదు. భీమ్‌, అస్సాం తేయాకు కార్మికునిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొండకోనల్లో ప్రకృతితో జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంగా నినదిస్తూ 1928 నుంచి 1940 వరకు కొమరంభీమ్‌ నైజాం సర్కార్‌ గుండెల్లో సింహ స్వప్నంగా రణభేరి మ్రోగించారు. 1940 అక్టోబరులో జోడేఘాట్‌ అడవులలో కొమురం భీమ్‌ స్థావరాన్ని ముట్టడించిన నిజాం సైన్యంతో పారాటంలో వీరమరణం పొందాడు.
కల్పిత చారిత్రక గాధ
           అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఇద్దరు చారిత్రక యోధుల జీవిత విశేషాలను, అమర త్యాగాలను ఎంచుకొని సూపర్‌ హీరోల గాధగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రాన్ని చారిత్రక పాత్రల కల్పిత గాధగా, విజయేంద్ర ప్రసాద్‌ రాసిన కథను, రాజమౌళి చిత్రంగా తీర్చిదిద్దారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌, అజరు దేవ్‌గణ్‌, ఒలీవియా ప్రధాన పాత్రలుగా ఈ వారంలో విడుదల అయిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో తూటాలుగా దూసుకుపోతోంది. కీరవాణి సంగీత సమర ప్రజ్వలన సంకేతంగా థియేటర్‌లలో ప్రతిధ్వనిస్తోంది. రాజమౌళి అసాధరణంగా దర్శక ప్రతిభావంతునిగా ఇద్దరు స్టార్‌ హీరోలు రామ్‌, భీమ్‌ కాల్పనిక కథనంతో రౌద్ర, రణ, రుధిర సిక్తంగా బాక్సాఫీస్‌ కుంభస్థలంపై జెండా ఎగురవేస్తోంది.
           తెలుగు చిత్ర రంగంలో వేలంవెర్రిగా, ఉద్ధృతమై కట్టలు తెంచుకొంటున్న 'హీరో ఇమేజ్‌' ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రత్యక్ష సాక్షిగా నిరూపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల పాత్రల సమర యోధత్వానికి, అల్లూరి, కొమురంభీమ్‌ వాస్తవ జీవన చరిత్ర అమరత్వానికి పొంతన లేకుండా కథ సాగుతుంది. చారిత్రకంగా వారి జీవితాలను అధ్యయనం చేసే నిజ శ్రద్ధాసక్తులతో స్క్రిప్ట్‌ లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది.
           ఈ చిత్ర కథా సినీ నిర్మాణంలో, ఎంత సినిమాటిక్‌గా చారిత్రక పాత్రలతో అల్లిన కల్పిత కథగా ప్రేక్షకులు సరిపుచ్చుకొన్నా, రామ్‌ పాత్ర బ్రిటీష్‌ ప్రభుత్వ విధేయునిగా భీమ్‌పై కొరడా ఝుళిపించి శత్రువుగా హింసించటం చారిత్రక యోధుల వ్యక్తిత్వాన్ని కించపరచడమే అవుతోంది. రామ్‌ ప్రేయసి సీత, కట్టుకథలో హీరోయిన్‌ లేని లోటు తీర్చుకోనటం, పబ్బం గడుపుకోనటం, తెలుగు సినిమాకు కొత్త కాకపోయినా, ఆ చారిత్రక తప్పిదం ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా కొనసాగింది. మన్యం పోరాట కాలం నాటి చరిత్రలో కనుమరుగైన సీత పాత్ర, ఈ చిత్రంలో కీలకంగా ప్రత్యక్షమవుతుంది. అంతేకాకుండా పదేళ్ళ వయసుండే ఆదివాసీ పిల్లని, ఢిల్లీ దొరల నుండి విడిపించడానికి, జూనియర్‌ ఎన్టీఆర్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌, ఆరాటం, పోరాటం ప్రధానంగా బ్రిటీష్‌ నిరంకుశ ప్రభుత్వంపై రగుల్కొన్న చారిత్రక పోరాట ఆశయ స్వేచ్ఛా స్వాతంత్య్ర ఆశయాన్ని నీరుకార్చింది. మారు వేషంలో అక్తర్‌ పాత్ర అంతా గందరగోళం. బ్రిటీష్‌ అధికార ఐశ్వర్య దర్పం, దొరసానుల ప్రేమభావనలు, ఇంగ్లీష్‌ డైలాగులు శృతిమించి గతి తప్పాయి. దేశభక్తి త్యాగనిరతికి సంబంధించి 'ఎత్తర జెండా', 'నాటు నాటు', 'కొమరం భీముడో', ధిక్కార స్వరాల విప్లవోత్తేజం పాటలుగా సంభాషణలుగా థియేటర్‌లలో ప్రతిధ్వనింప చేసినా సినీ కథకి అనుసంధానం అంతగా కుదరలేదు. వైర్‌ వర్క్స్‌, గ్రాఫిక్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఎమోషన్‌ సీన్‌లు ప్రేక్షకులకు పూర్వమే రుచి చూపించటం కారణంగా ప్రేక్షకులు సమ్మోహిత అంతగా లేదు. ఏదిఏమైనా రాజమౌళి వంటి సినీ మేధావి స్థాయికి తగ్గట్టుగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ లేదు. రాజమౌళి గారూ.. మీకు ఇది తగునా?

- జయసూర్య

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.