Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్తింటి వేధింపులే కారణం..
నవతెలంగాణ -గంభీరావుపేట
అత్తింటి వేధింపులు.. తల్లికోలేక ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన రేఖ(28) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. సోదరుడు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. దాంతో ఆమె ఆలనాపాలనా పెద్దనాన్న కొడుకు చూశాడు. ఆమెకు కొత్తపల్లి గ్రామానికి చెందిన తన మేనబావ వరుకుటం రాజుతో వివాహం చేశారు. పెండ్లి సమయంలో కట్నం, లాంఛనాలు అన్ని విధాలా ఇచ్చారు. అత్తింటినుంచి రేఖకు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. అప్పటి నుంచి వేధింపులు మరింత పెరిగాయి. పలుమార్లు పంచాయితీలు పెట్టించి, సమస్యను పరిష్కరించే దిశగా పెద్ద మనుషులతో రాజీ కుదిరించే ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. గురువారం రాత్రి రేఖను తీవ్రంగా కొట్టారు. భరించలేకపోయిన రేఖ తన ఇద్దరు కుమార్తెలు అభిజ్ఞ(2), హన్సిక(6నెలలు)ను తీసుకొని కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఊర చెరువులో దూకింది. శుక్రవారం మృతదేహాలను గుర్తించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని గంభీరావుపేట ఎస్‌ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ కొలాని మొగిలి పరిశీలించారు.