Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షల కోసం డిపార్ట్‌మెంటల్ అధికారులను కొనసాగించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పాతపద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు డిపార్ట్‌మెంటల్ అధికారులను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వారిని కొనసాగించాలని కోరుతూ టిప్స్, టిగ్లా, టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475, ఇంటర్ విద్య తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, గెస్ట్ లెక్చరర్ల సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి డిపార్ట్‌మెంటల్ అధికారులను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.