Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా (నాసా)-ఎన్‌ఎస్‌ఎస్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో వరుసగా తొమ్మిదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా శ్రీచైతన్య స్కూల్ నిలిచింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మెన్ బిఎస్ రావు, శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి 25కుపైగా దేశాలు పాల్గొంటే భారత్‌ను నెంబర్‌వన్ స్థానంలో తమ విద్యార్థులు నిలబెట్టారని తెలిపారు. నాసా కాంటెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 145 ప్రాజెక్టుల్లో 107 ప్రాజెక్టులు భారత్ నుంచి ఎంపికయ్యాయని వివరించారు. అందులో 66 శ్రీచైతన్య నుంచే ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ఒకటి, రెండు, మూడు బహుమతులలోగాని, గెలిచిన ప్రాజెక్టుల సంఖ్యలోగాని, అందులో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యలోగాని ఏ విద్యాసంస్థ సైతం శ్రీచైతన్య సాధించిన ఫలితాల్లో సగం ఫలితాలనూ సాధించలేదని తెలిపారు. ఈ ఫలితాల ద్వారా తమసంస్థ నెంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. బట్టీపట్టే విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్ట్ ఆధారంగా బోధనా ప్రక్రియ, కార్యక్రమాలు, ప్రాక్టికల్ ఓరియెంటెడ్ టీచింగ్ ద్వారా మామ్రే ఇలాంటి ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.