Sun 04 Apr 00:07:22.248514 2021 మనసులోని ఆవేదనవిశ్వమంత విస్తరించినాకన్నీటి బొట్టుగా రాలిపడితేనేగుండె బరువు తగ్గేది,ఒక్కో బొట్టూవెచ్చని అడుగులేస్తూఓదార్పు తీరం చేరుతుంది! మౌనం మొలకెత్తుతుంటే శూన్యపుతీగలుజి దేహమంతా అల్లుకుపోతాయి, జీవితం చీకటిఖైదీ కాకముందే వెలుతురుహస్తం తోడై స్వేచ్ఛాగీతిక పలికించాలి!గులాబికేం తెలుసుగుచ్చుకునే ముల్లు బాధ,ముల్లుకేం తెలుసువాడిపోయే గులాబీ బాధ,అందమైనవన్నీ తాత్కాలికమేపొందలేనివన్నీ విషాదమే,వికసించేది ఒక్కరోజైనాపరిమళం జీవితాంతం,కుమిలిపోయేది క్షణమైనాఅంతమయ్యేది జీవనం! చినుకులుగా రాలే కన్నీళ్ళు సముద్రమంత లోతును చూపిస్తాయి, మిణుగురులుగా వెలిగే ఆనందాలు వెన్నెలలాంటి జీవితాన్ని చూపిస్తాయి! - పుట్టి గిరిధర్, 9491493170 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి