Sun 18 Apr 01:31:17.31722 2021 అదుగో చూడు!అల్లంత దూరాన కొండలు కావవి కొండలు నింగి తల్లి నేలమ్మకు ఎత్తిన బోనాలు!కొండలను చూస్తేఅచ్చం భోనాల వరుసలే!ఎవరో ఎత్తుకవచ్చి పెట్టినఅక్షయ పాత్రలే! సూర్య బింబం బోనాలపై వెలుగుతున్న దీపం!కొండల మధ్యన చూస్తేపసుపు బొట్టై దీపించే చంద్రబింబం! కొండలపై చెట్లు చేమలు రాళ్లు రప్పలు బోనాలకు అలరారే అలంకరణలు!రాత్రి వేళల్లో నక్షత్రాలుబోనాలకు మల్లె పందిరులవెలుగులైతయి!పాలపుంత మెత్తని తివాచీ! మేఘాలు బోనాలకు గొడుగులైతయి ఉరుములు మెరుపులు భవిష్య వాణి పలుకుతయి!మనం ప్రయాణిస్తూ చూస్తేకొండలు భోనాలై ఊరేగుతున్నట్లుముచ్చటేస్తుంది! ఎప్పుడు చూసినా తలపై భోనం నిండుగ! భారము కాదు తల్లికి తన పిల్లల కడుపులు నిండగ!తన పిల్లల కడుపులు నిండితేనేలమ్మకు రోజూ బోనాల పండుగే! - పి.బక్కారెడ్డి, 9705315250 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి