Sun 18 Apr 02:37:22.06712 2021 అతివల అందాలకిఅదనపు సొగసులద్దడాన్కిఅదొక ఆకర్షనౌతుంది.పదిమంది ముందుపసివాడి ఆకలితీర్చడాన్కిఅది ఓ పవిత్ర ఆభరణమౌతుంది. తన కన్నీళ్ళనే కాదు ఆపన్నుల కన్నీళ్ళు తుడుస్తూ ఓదార్పునిచ్చే ఆలంబనవుతుంది. అన్యాయాన్ని ఎదురించేటప్పుడు ప్రదర్శించే పౌరుషానికి ఓ చిరు చిహ్నమవుతుంది.స్వేదం చిందిస్తేగానిరోజుగడవని తల్లులకుపిల్లల్ని వ్రేలాడదీసుకోడాన్కిచంకన ఊయలవుతుంది.సిగ్గుమాలిన సమాజంలోకపటపు కళ్ళుగప్పడాన్కిఓ రక్షణ కవచమవుతుంది. కన్నవాళ్ళే కాదనుకున్నప్పుడు అయినవాళ్ళుఅక్కరకురానప్పుడు దీనస్థితికి దిగజారినప్పుడు దేహీ అని అర్ధించడాన్కి ఆ ''పవిటకొంగే'' బిక్షాపాత్ర అవుతుంది.ఆత్మాభిమానాన్నిచంపుకోలేనప్పుడుశాశ్వతంగా దూరమవడాన్కిఆ ''పవిటకొంగే''ఉరితాడవుతుంది. - యం యస్ రాజు, 9502032666 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి