Sat 08 May 23:43:47.869558 2021 ఉక్రోషం ఉప్పెనౌతోంది..గుండె మండిపోతోంది..ఏదో చేసేయ్యాలన్న కసితోనరం నరం సమాయత్తమవుతోంది..ఏళ్ళ తరబడి అదే మోసంఅదే దోపిడి..కరెన్సీ భాషే సర్వామోదంకాగితాలతోటే అన్నీ కప్పెట్టెయ్యడం..జానెడు పొట్ట నింపుకోడానికికాకుండాజగమంత బొక్కసాన్ని నింపిదాచేసుకోవాలన్నంత తాపత్రయమెందుకు?..సౌభ్రాతత్వ భావనలుపుస్తకాలకే పరిమితమా?..దరికి చేరితేదోచెయ్యడమేనా పరమావధి?నీలో దైవత్వానికి ఉనికి కనబడుతుందనుకుంటేరాక్షసత్వానికి సాధుముసుగు ద్యోతకమవుతోందేమిటి?ఎన్నిసార్లు పెరికివేసినాకలుపుమొక్కల్లా మళ్ళీ విస్తరిస్తూనే ఉన్నారు..కబంద హస్తాలతో కబలించేస్తున్నారు..అందుకేమానవుడు..దానవుడుగా మారిన ప్రతిసారి..దుష్ట శిక్షణ తప్పనిసరి..!!- సుజాత.పి.వి.ఎల్ 7780153709 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి