పల్లవి : ఆగదు ఏ పన్ను నీ కోసమూ ఆగితే సాగదు ఈ ప్రభుత్వము ముందుకు సాగదు ఈ ప్రభుత్వమూ !
చరణం-1: జీతమ్ తక్కువని, ధరలు పెరుగునని తెలిశినా కొత్త పన్ను రాక ఆగదు ! కారు చవక అని డీజిల్ దొరుకునని తెలిశినా, అర్ధరాత్రి ప్రకటన ఆగదు ఆగదు ఏ పన్ను నీ కోసము !
చరణం-2 : జీఎస్టీ ఒక వ్యూహమని, లోపలికి వెడితే రామని తెలిసినా పన్ను పొటూ ఆగదు ! సంపద స్వర్గమని టాక్సూ నరకమని తెలిసినా స్వర్గ నరక చక్రమాగదూ ! పన్ను తధ్యమని ఏ జీవికి తప్పదని తెలిసినా ఈ సంపాదన ఆగదు ! ..... ....... ఈ ''పై'' సంపాదన ఆగదు !
చరణం-3 : సెంటర్, స్టేట్ కలయికతో ఉదయించక ఆగదు పన్ను ! పన్నుల పోటుతో విరగక మానదు వెన్ను! పన్ను పెరిగినా, డబ్బు పొయినా ఆగదు ఈ పన్నుల ప్రవాహాం ! పన్ను కట్టినా, కట్టని పన్నయినా ఆగదు టాక్సాభీ షేకమ్ ! ఆగదూ టాక్సాభిషేకమ్ !