మరో వ్యక్తి నను విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్లిపోయింది ఇలా ఇదేమైనా తొలిసారి జరిగిందా ఈ కాలమెప్పుడైన ఎవరికోసమైన ఆగిందా..?
తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి నా వర్తమానాన్ని తొక్కేసింది నా స్వప్నాల్ని కాలరాసి కాలంపై స్వారీ చేస్తూ స్వార్థాభివద్ది దిశలో దూసుకొనిపోయింది..
కాలగమనప్రవాహంలో నిత్యం కొట్టుకొనిపోయే ఆశల పొదరిల్లు, ఆశయాల హరివిల్లులెన్నో.. కాలమే గదా హదయానికి గాయం చేసేది అదే కదా ఆ గాయాన్ని క్రమంగా మాన్పేది
కాలాన్ని మించిన కాలుడెవరు దాన్ని మించిన వైద్యుడెవరు ఒక్కోసారి అదే గుండెను పిండేస్తుంది ఇంకోసారి అదే గుండెకు అండగా నిలబడ్తుంది..
నే విన్నాను ఆ కళ్లు నేడు వేరేవారి కోసం కన్నీళ్లు కారుస్తున్నవనీ నా ప్రేమతటాకంలో నుండి వేరేవారు నీళ్లు తోడుకుంటున్నారనీ..
నేను చాలా కష్టాల్లో ఉండి కన్నీళ్లుగా చిలికి నీ కళ్లల్లో నుండి బైటికి వచ్చేశాను లేదంటే ఎవరు ఖుషీగా తన స్వదేశం నుండి బైటికి వెళ్ళిపోతారు.. - సర్ఫరాజ్ అన్వర్, 9440981198