కరోనా వైరస్ కారణంగా వేలాది ప్రాణాలు పోతున్న ఈ తరుణములో.. ''రుద్రవీణ'' చిత్రంలోని ''తరలిరాద తనే వసంతం'' అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాట సరళిలో... పల్లవి : మరలి పోద తనే కరోనా మన దడిని చూసి దడెక్కి పోదా మరలి పోద తనే కరోనా మన దడిని చూసి దడెక్కి పోదా మరణాలు చూసి బెంబేలు పడక, మనమింటిలోనే ఉందాము కదరా || మరలి || చరణం 1: నలుగురి కోసం ఒక్కరుగా మనమే ఉంటే చాలు కదా నానా యాగి చేసిన గాని, తానే చివరికి సమసును కాదా ఇలా తలచి మనమే ఉండాలిప్పుడు ఇదే కదా మనకు మార్గం ఇప్పుడు వెళ్తే ఏమౌనంటూ బయటకి నువ్వే వెళ్తే మిల్తే హై హమ్ నేస్తం మరో జన్మ ఉంటే ఇది మనకొక విషమయ స్థితిలే, ధైర్యంగా సాగాలి || మరలి || చరణం 2 : బయటికి వెళ్ళే అవసరముందా, రావాలా బీమారి? బ్రతుకును మించి వేరే ఉందా? ఆలోచించు ఒకసారి! ఏ జబ్బైనా ముదిరిందంటే, జీవితయాత్ర ముగిసేనంతే! ప్రజారోగ్యం కొరకే ఇపుడు ఆంక్షలున్నవి, మన ప్రయోజనం కోరి కొనసాగుతున్నవి పిల్లలు అడిగారంటూ పాలకూర కోసం గుంపుగున్న మార్కెట్‌కే వెళ్తే నీ ఖర్మం నీ చావుని నీవే మరి కోరినట్టు తెలుసుకోరా || మరలి ||