Sat 12 Jun 20:49:09.259422 2021 నీ తనువు నిండాఅణువణువుఓ పువ్వుల తావినైవిచ్చుకుంటా...!నీ దరహాసపునవ్వులకునింగిలోని నెలవంకనైఅనునిత్యం చెంత చేరుతా..!నీ చెవిలాదుద్దులకు కుందనమైతీరని అందాలనుఅంటు పెట్టుకుంటా..!నీ చేతులగాజులలోపారే ఏరులో అలుగైసరికొత్త సవ్వడులసంగీతాన్ని అవుతా...!నీ కన్నులలోకాంతులు విరజిమ్మేపున్నమి నాటి చంద్రుడివెలుగునవుతా..!నీ దరహాసపు కన్నులకొలనులో తామెరనైకనువిందు చేస్తా...!నీ గొంతులోరాగాల ప్రవాహమైసరాగాల ఊసులను పంచేసరిగమలనవుతా...!నీ మదిలోభావాల అలజడులకుకోకిల గొంతుకనైకొత్త రాగాలను ఆలపిస్తా...!నీ వలపులతనువులో వాననైతడిసి ముద్దనవుతా..!నీ కలలకౌగిళ్ళ గూటిలోనీ వశమై యధేచ్ఛగాఆశల పల్లకినవుతా..!నీ జీవనగమనంలోవెన్నెల జాబిలిలా జీవితాంతం తోడై ఉంటా..!నీకైనా దేహాన్ని ధారపోసిఆరిపోని మమతలఉజ్వల దీపానవుతా..!నీలో నేనుజన్మ జన్మలకిఓ కొత్త రూపమైఆమనీ వసంతములారూపుదిద్దుకుంటా..!- కొలిపాక శ్రీనివాస్9866514972 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి