తండాల్... తండాలన్ని... బోసిబోయిన విధవరాలి మెడలా మిద్దెలు, మేడలా జాడలేకున్నా ఉన్న పూరి గుడిసెలన్ని పురుగుల గుళ్ళవుతుంటే...! నా లంబాడీ బిడ్డల ''రాం రాం.. భీయా...!'' అనే పలకరింపులు ఏ పట్నం బాట పట్టాయో..!? హౌలీ పండుగ నాడు... కట్టెలేరి తేచ్చి కుప్పా వేయాల్సిన నా అన్నలు.. తీజ్ పండుగ నాడు పందిరినంటిపెట్టుకున్నా బుట్టల్ని నెత్తినపెట్టుకోవాల్సిన నా ''యాడి, భాయి''లు ఆకలితో చేసే పోరులో...! ఏ రాజు సైన్యంలో సైనికులయ్యారో...!? తావులేక ఏడ్చే కాకులేమో కాని అవి మోసుకొచ్చే చావు కబుర్లను చేవినేసుకునే చిన్నవాడైన లేకపాయే...!? గొడ్డు గోదానమ్ముకొని పిల్ల జల్లా అంతా కలుపుకొని బుద్ధేరగక ముందే బాధ్యతనంతా భుజాలమీదేసుకోని సాగు భుమంతా... ఇటుక భట్టిల కారా?నవుతుంటే మేము చేసిన ఇటుకలన్ని ఏ రాజు కోటకు పునాది రాళ్ళయ్యాయో...!? ఎండ్లకు ఎండ్లు.... ఎండైనా వానైన లెక్కచేయక ఎముకలిరిగేలా చేసిన కష్టమంతా..! ఏవనింటి సిరి సంపదలయ్యాయో...!? మళ్ళీ ఎనుకటి సంచార జీవనం తప్పదేమో మా తండాలకు...! - సభావట్ హాథిరామ్ (మాతృ శ్రీ), 6309862071