ప్రవహించడం అంటే నాలోకి నువ్వు నీలోకి నేను మాటల తెప్పపై మధురానుభూతితో ప్రయాణించడం
సగం నువ్వు ఇంకో సగం నేనూ కొన్ని మార్మికాల్ని మరచి భుజం భుజం ఆన్చి ఒక ఒడ్డులా నిలవడం
అపార్థాల అల్లకల్లోలాల అలలు ఎన్ని చెలరేగినా నదిలా నిలిచి స్నేహ వారధిలా పారడం
నడుస్తూ జ్ఞాపకాల నురగల్ని కక్కుతూ కాలం వంతెనపై కలకాలం కమనీయ దశ్యకావ్యమై నిలవడం
నానుంచి నువ్వు నీ నుంచి నేను ఆత్మీయ ఆర్తితో ఆలింగనమై సాగి, కొనసాగడమే స్నేహ ప్రవాహం మది తీరాల్ని చేరి మనస్సు పుస్తకం స్నేహకావ్యం అవుతుంది...!! - మహబూబ్ బాషా చిల్లెం 9502000415