తెచ్చిపెట్టుకున్న చుట్టరికం కాదు అడిగితే వచ్చిన బంధం అసలే కాదు ఒకరికి ఒకరుగా నేను నీకు తోడని నీవు నాకు నీడని బాసచేయని భాషగా పెనవేసిన బంధం జగతిలో విరబూసిన అపురూప అనుబంధం ''తోబుట్టువుల'' సంబంధం
'ఆడ'పిల్లయినా ఈడనే మనసుపెట్టి అమ్మా,నాన్నల్లో సగమై అమ్మలాలన నాన్నపాలన పంచి అన్నింటికీ తానున్నానని భరోసా ఇచ్చే సోదరుని క్షేమమే శ్వాసగా వారి ఎదుగుదల కాంక్షిస్తూ...