Sun 12 Sep 05:45:58.305426 2021
Authorization
అది అందాల పట్నం,
జాతరలో తిరిగే రంగ్గుల రత్నం..!
అక్కడి జీవితాలు గిర్రున తిరిగే బొంగరం,
ఏ మాయలోడికో చిక్కితే బొమ్మలం..!
వలసెల్లే పక్షులకు నీడ నిస్థుంది,
పొట్ట కూటి కోసం ఏదైనా చేయిస్తుంది..!
అందరినీ అక్కున చేర్చుకుంది,
అమాయకంగా ఉంటే దోచుకుంది..!!
అడ్డా మీది కూలీల అరుపులతో తెల్ల వారుతుంది,
సాఫ్టు వేర్ కంపెనీ ల సైరన్ తో పొద్దు గుకుతుంది..!!
కంపు నాంతా ఒడిలో దాచు కుంటుంది.
అద్దాల మేడలో కులుకుతుంది.
ఆ మేడల పక్కన పురి గుడిసెలో సంసారాలు,
బతుకు దెరువు కు వచ్చిన పేదల ఆనవాళ్లు..!!
ఎందరో వేశ్యల ఆకలి తీర్చిన అక్షయ పాత్ర..!!
నగరం నడి ఒడ్డున నర మేధం సష్టించిన,
నవ్వుతూ పోసే జనాలు ఉంటారాంతా..!!
సచివాలయం బయట అర్జీ దారుల పడిగాపులు,
లోపల దొరవారి బోగాలు..!!
కనికరించడు గేటు కీపర్,
నా దగ్గర ఉన్న చిల్లర కు వాడు లోంగాడు..!!
గగన వీధిలో మెట్రో పరుగులు,
ఫుట్ బొట్ పై బస్సు ప్రయాణాలు..!!
ఇరానీ చారు, బిర్యాని ఫేమస్,
అవి తింటే ఫుల్ జబర్దస్త్..!!
ఉస్మానియా గడ్డ, మేధావుల అడ్డా..!!
ఉద్యమాలకు పురుడు పోసిన యుద్ధ భూమి,
త్యాగాలను సాక్ష్యంగా నిలిచిన అవని..!!
ఎవరికీ తెలియదు చేదు నిజం,
నాన్ బడర్ రాబందుల ఆవాసం..!!
ఎదురించ లేదు వారిని కొత్త తరం,
సీటు వదులుకొని ఇంటికి ప్రయాణం..!!
నెక్లెస్ రోడ్డులో ప్రేమా జంట,
పక్కన ఫ్యామిలీ ఉన్న విషయమే మరిచిరి అంటా..!!
తల్లి తండ్రుల చాటున తీర్చుకున్న సరదాలు,
ఆ ట్యాంక్ బండ్, గండిపేటలో
దుంకే ఎందరో అమర ప్రేమికులు..!!
గోల్కొండ, చార్మినార్, మక్క మసీదు,
బిర్లా మందిరం, అసెంబ్లీ ఎన్నో చారిత్రక కట్టడాలు,
నాటి మా కూలీల చెమట చుక్కలకు ఆనవాళ్లు..!!
నైజాం ఏలిన సంస్థానం, మా భాగ్య నగరం..!!
- అజరు కుమార్
8297630110