Sun 12 Sep 05:46:38.39346 2021 ఇప్పటికీ కొన్ని వేదికల మీదఇంకా ఎవరో గర్వంగామాటలమూటల్ని విసురుతూనే ఉన్నారునేను అంతరిక్షాన్ని అందుకున్నాననిచందమామను చేరుకున్నానని..అప్రతిహత శాస్త్ర పురోగతితోసాంకేతిక ఫలాల్ని అందుకునిసర్వసుఖాలు అనుభవిస్తూదర్జాగా జీవిస్తున్నాని..కానీ నేనింకా రాతియుగంలోనిపశువు కన్నా హీనంగాలోహాయుగంలోని ఆదిమ మానవుని కన్నాదీనంగా నాగరికత పై పై మెరుగులతోమానసిక అంధకార యుగంలో జీవిస్తున్నాను..ఆదిమ మనిషి వేటాడుతూపచ్చి మాంసం తింటూ గుట్టల్లో,చెట్ల తొర్రల్లో అనాగరికంగా బతికినప్పటికీమానవత్వం తలేగరేసుకుని బతికింది..కానీ ఈ రాకెట్ యుగంలోశాస్త్రసాంకేతికతను వాడుతూజీవనబండిని హాయిగా తోలుతున్నప్పటికికూర్చున్న చోటు నుండే ప్రపంచాన్నిఏలుతున్నప్పటికి..నింగినంటుతున్న కాంక్రీట్ కీకారణ్యంలోఅపాదమస్తకం స్వార్థంతో నిండిపోయివైఫై వాడుతూ హైఫై గా ఉంటున్నప్పటికీమానవత్వమే ఎందుకో బిక్కచచ్చిపోయిఅడవుల్లోకి, కొండకొనల్లోకి పారిపోయింది..ఉగ్రవాద పైశాచిక కరాళ నత్యానికిజడిసి విమానం రెక్కలపై నుండిజారిపడి మానవత్వం ముక్కలైతేఆధునిక మానవుడి ఆకత్యానికిఅదిరిపోయి మరోచోట అదివివస్త్రయ్యి సిగ్గుతో చచ్చిపోయింది..- సర్ఫరాజ్ అన్వర్, 9440981198 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి