Sat 02 Oct 23:07:24.83758 2021 తల్లీతనయుల పేగుబంధం...తరతరాలుగా ముడివేసిన అనుబంధం...పెనవేసుకుపోయిన ఋణానుబంధం...వసుధాసేద్యకుల జీవనబంధం...తొలకరితో మురిసిపోయే...నేలతల్లిమనసునుజిమురిపెముగా దున్నుకొని...అనురాగ విత్తనాలు తన హదిలో నాటి...ప్రేమనారు మొలకెత్తువరకు వేచి...వెన్నవంటి మదిమన్నులో నారు నాటి...నల్లబారిన మబ్బువంక ఆశగా పరికించిచూసి...కరుణించని మేఘుడికై పూజలెన్నోచేసి...ఆరుగాలం అహర్నిశలు శ్రమించి...తన స్వేదంతో ధాన్యం పండించి...జగమెల్లా ఆకలితీర్చేఅక్షయపాత్రే రైతన్న... అయినా ఆయనకు కరువేపిడికెడన్నం,ఎముకల గూడే ఆయన దేహం...నేలతల్లి వరమిచ్చినా, దళారుల మోసానికి అనాదిగా బలి అవుతూ...పెట్టుబడికూడా గిట్టుబాటుకాక...నేలమ్మనే నమ్ముకున్న రైతు,అప్పులపాలవుతూ....భార్యాబిడ్డల సాదలేక తన తనువెల్లా తాకట్టుపెట్టి...ఆకలి తాళలేని రైతన్నలెందరో...!తనువు చాలించి,తనుదున్నిన నేలతల్లి పొత్తిళ్లలో సేదతీరుతున్నారు...!! - యువశ్రీ బీర, చర్ల, భద్రాద్రి జిల్లా టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి