Sat 02 Oct 23:43:07.455684 2021
Authorization
సూర్యుడు
రోజూ జీవరసాన్ని
అక్కడే జుర్రుకొని
ప్రపంచంలోకి పయనమౌతడు
చంద్రుడు చల్లదనాన్ని
అక్కడినుంచే పొదుగుతడు
ఏళ్ళు సెలయేళ్ళ
జీవనాడి ణఅడవులే ...
సముద్రాల నీటికండలూ
నెత్తుటి ముద్దలన్నీ అడవులే.
రోజుకొక్కసారైనా
సూర్య చంద్రులు వెనక్కితిరిగి
అడవికి రాంరాం చెప్పి వెళ్తరు
నదులు సముద్రాలు ఒక్క సారైనా
నీటి పరుపులు పరుస్తయి
అడవి బిడ్డలు అడవికి బిడ్డలు
అడవికోసం బిడ్డలు
నాగరికతకు
మానంచుట్టి బతుకు నేర్పి
రాళ్లను వజ్రాలుగా పూయించి
జ్ఞాన బీజాలు నాటిన
నిసర్గ జీవులు నిజం లాంటి జీవులు
మాట్లాడరు మాట కింద పడనీయరు
కనీసాలకై పిడికిళ్లైనవాళ్ళు
ఏ సీ సుఖాలను
ఎడమ కాలితో చీ కొట్టినవాళ్ళు
కండ్లముందరే
లారీలలో వెళ్తూ వెళ్తూ
ముక్కలైన దేహాలతో
బేల చూపులు చూస్తుంటే...
మొక్కైనా మనిషైనా
ఎన్ని ఆయాసాల మధ్య
అంతెత్తు ఎగబాకేది !
తల్లితనం తెలియనోళ్ళకు
తల్లి యాస పలక రానోళ్ళకు
ఏమర్థమౌతుంది!
అడవిలోకి తెల్ల పులులు
నగరాల్లోకి అడవి పులులు
నగరమంటే అసహ్యం అడవి జీవులకు
స్వార్థపు రూపాలు, బిగిలేని మాటలు
అందుకే
తెల్లపులుల వేట మొదలైంది
కలప హత్యగాళ్ల ఆట శురువైంది.
నిలువెల్లా రంపపు గాయాలతో
అడవి సొమ్మసిల్లింది
రేపు అడవి, అడవిలోని మనుషుల
పటం మారిపోవచ్చు
నాడు మొక్కలు నాటిన దోర వేళ్ళు
ఏడుస్తూ కేకలేస్తూ
అడవిని చూడనీకి
అడవిపాట విననీకి
ఎదురు చూస్తున్నరు.
- డా.ఉదారి నారాయణ, 9441413666.