Sat 13 Nov 22:39:18.430637 2021 నిశబ్దం నిదురపోయినప్పుడల్లాగాలి ఈలలు వేస్తూహుషారుని ఉసుగొల్పుతుందిదిగులుతనంతో డీలా పడ్డ చెట్టునుగుంబనంగా ఆకుల్ని స్పశిస్తూఆశల గీతాల్ని ఆలపిస్తుందిచికాకు మనసుకుతుమ్మెద ఝుంకారమైఅలా,అలా అలల్లామెత్తని మలయమారుతమై ఊరడిస్తుందిగాలి గల, గలలతోఊరంతా రెక్కలు విప్పిన పక్షిలా మారిమనో తీరాలపై పయనిస్తుందిగాలి ఊరి చుట్టమై వాలిన ప్రతిసారీసొగసు సోయగపు చిత్రమై పల్లె పరవశిస్తుందిగాలి పాడే గమకాల పాటలతోపల్లె పచ్చని తోరణాలు మధ్యపసి పిల్లాడిలా హాయిగా కమ్మని కలల్ని ఎగరేస్తూ శ్రమ రెక్కల్ని ఆదమరుస్తూ నిద్రకు ఉపక్రమిస్తుంది...!! - మహబూబ్ బాషా చిల్లెం 9502000415 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి