చిత్తడిన నాటిన విత్తనానితో చినుకు రేపిన మట్టి వాసనది సుతిమెత్తని మధురాతి మధుర ప్రీతి పాత్ర చైత్ర బంధం
తన చెమట గంధపు తడితో చిరు మొక్కల పసి ముఖాలను తుడుస్తూ.... నలువైపులా ప్రపంచానికింత పచ్చదనం అందించే తపస్సులో కూర్చున్న మహా గొప్ప ఋషి ఈ కషీవలుడు ప్రకతి కాంతకు ఏకైక పురా చెలుడు
వేకువ పొద్దు నిస్సద్దు తెల్లారుగట్ల తలపాగా చుట్టుకు చేలగట్ల పై నడుస్తుంటే జగతి వెలుగు ప్రగతుల రథసారధి మట్టి చరణాలపై కిరణాలతో ప్రణమిల్లుతాడు
ప్రతీ మనిషిని ఆకలి పేగును తన నాగలితో ముడివేసుకున్న వాడు అన్నపూర్ణకు అతడే ముద్దుబిడ్డ అవనిపై అందుకు పంచభూతాలే సాక్ష్యాలు
రైతంటే ఈ దేశపు వెన్నెముక లాఠిలతో విరిచే కుట్రలు మానండి శాంతికాముకులతో యుద్ధమా రాక్షసులరా మీరు మారండి