దేహ భాగాలకు గడియారపు ముళ్ళనతికించుకొని నిర్వచించలేని దీర్ఘ మౌనాల మధ్య మాటలకు సంకెలలు వేయబడుతున్నపుడు బయటకు రాలేని అర్థవంతమైన భావనలు నినదించే ప్రయత్నం గతాల శోధనలో భవితకు వెలుగులందివ్వాలనుకునే తపోదీక్షాపరులు సంస్కరణాభిలాషలు లోపాల అన్వేషణలలో కొందరు అభిరుచులకై అరువివ్వని కాలానికి నిద్రను కానుకగా ఇచ్చే రాత్రులు అనేక సంఘర్షణల పర్యవసానాలు కలవరపడ్డ హదయం ఒకానొక రోజు తన గాథలను కొసలలోంచి కన్నీరొలికే చోట ముంగురులు అల్లరి చేసిన చోట నిశ్శబ్దంగా విస్తరిస్తుంది ధూళి పైనా భానుకిరణాల పైనా అభియోగం వేస్తాం కానీ గడిచిన కాలపు అంతర్మథనాల వ్యూహాత్మక ప్రణాళికే కదా ఇది నువ్వు నీ పైనా ఈ లోకం పైనా మనసు పడినపుడు అంతరంగం మౌనంగా రాసే బహిరంగ ప్రేమపత్రం పిగ్మెంటేషన్ - డా|| కాచాపురం దుర్గాదేవి, 7893093495