Sun 23 Jan 11:26:24.824974 2022 కవిత్వం రాయిఆ కవిత్వం అరికాలికి ముల్లు నాటితేతలలో వెంట్రుక సుడి తిరిగినంతనొప్పి బరాయింపుతో కవిత్వం రాయి.ప్రజల కవిత్వమే రాయిలేదా అస్సలు రాయకు.ఊరినుండి వెలివేసినవారికినీ కవిత్వం ఊపిరవ్వాలిఅట్టడుగు జాతుల అణచివేతలకునీ పదాలు పునాదులవ్వాలి.నీ కవిత్వంగొంతుమీద కాలుపెట్టి తొక్కినబాధితుడి వైపు నిలబడాలిచేయని నేరానికి సెట్టుకు కట్టేసిఈతబర్రెలతో కొట్టినఅమాయకుడికి అండవ్వాలి.ఉద్యమంలో ముందు నడిసేటోడుపిడికిలెత్తి పలికితే నీ కవిత్వమే నినాదమై కదం తొక్కాలిఉరికంబం ఎక్కేముందుచివరిసారిగా నీ పదాలే పలికేటంతటి గట్టిగ రాయి.ప్రజల కోసమే రాయిప్రజలే నీ కవిత్వాన్ని మోసే భుజాలని మరిసిపోకు.నోట్ల నాలుక లేని వారికి నీ కవిత్వంనాలుకవ్వాలిజివీపున వెన్నెముకలేని జనాలకునీ వాక్యాలు వెన్నెముకై నిలబడాలి.నీ కవిత్వంఏ ప్రజల కోసమైతే రాసావోఅక్కడిదాకా పయనించి ఆ గుడిసె కొనలపైవిప్లవాల జెండలెగరేయాలి.పాలిపోయే కవిత్వం రాయకునలుగిట్లో తేలిపోయే వాక్యాల జొలి అసలే వద్దు.కవిత్వంమనిషిని పదునెక్కించాలికవిత్వంసమాజాన్ని పరిగెత్తించాలిఅలాంటి కవిత్వమే రాయి.అఖరికీ అలాంటిదే కవిత్వమని నమ్ము. - అవనిశ్రీ9985419424 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి