మట్టిని పిసికిన చేతులు అనుభవించిన కష్టాల బతుకులు ఆకుపచ్చని నారు మడిలో రైతులు రాజ్యమేలని రాజులు
పొలం దున్నిన హలాలన్నీ చిలికింది జలధార ఎద సొదల్లో వరద గుడేసి నిండిన చెరువుల రైతులు రాజ్యమేలని రాజులు
కషి విత్తనంలో ధాన్య విన్యాసం తొలిచిన పలుగూ పారా వికాసంలో పండించిన వరి పంటలో సొగసుల రైతులు రాజ్యమేలని రాజులు
రైతుల కన్నీరు పెట్టించే కంటక పనులు మున్నేరైన సునామీ కబంధ హస్తాలు కిసానుల కనులలో క్రాంతి దీపాలైన రైతులు రాజ్యమేలని రాజులు ఇల
వెన్నుదన్నైన ఎదలో పండగ రైతన్న మట్టి మనసుల చెమట గొప్పతనం బతుకు చీల్చే పనులన్నీ ఓడిన నేల రైతులు రాజ్యమేలని రాజులు ధాత్రి
ఆకలి నేర్పింది అన్నం విలువ మనిషికి రైతుల కషిలో అన్నమైంది ఆకలి ఓషధిలా ఇక రైతులు రాజ్యమేలని రాజులు నిజమే భువిని... - డా|| టి.రాధాకష్ణమాచార్యులు 9849305871