Sat 29 Jan 22:53:48.663653 2022 పిచుకల గుంపునీ చుట్టూ నో ఎదురుగా నో చేరిగంపలు, గంపల కొద్ది ప్రశ్నలు కుప్పలు పేరుస్తున్నాయై, ఏం?పట్టించుకో వేం నిద్రనో, చెవిటి తనమో ప్రదర్శిస్తావ్ నిర్లక్ష్యం చేస్తున్నావ్, ఆఊయల్నిండా ఉచ్చ పోసుకొని తడి, తడి చిరాకుతో వంకర్లు పోతుండే వాడివి, అప్పుడుగబాల్న తలుపు తెరుచుకునో అద్దం లోంచి ముఖం ఊడ బెరుక్కోనో ఉరక లెత్తి వచ్చిన తల్లి, ఎత్తుకొనికన్నా, నా చిట్టి తల్లీ అని లాలించి, బుజ్జగించి పాలిచ్చో, పండ్లిచ్చో కంది పోయున్న నీ ముఖాన్ని శీతలీకరిస్తుంది. ఆఅమ్మ నేర్పిన సుగుణాన్ని కటికతన్లౌ కత్తి విసిరి నీ బాల్యాన్ని నరుకున్నావా? ఆఅమ్మ వళ్ళో సేద తీరాక విప్పారిన ముఖాన్ని ఎక్కడ తాకట్టు పెట్టావ్? అహం మసక పోర చీకట్లో మాయమైందా ?అటు చూడు పిచుకలన్నీ శపిస్తున్నాయి గద్ద ఒక్కటే నీ తోడు నువ్వు ఇక కనుమరుగౌతావ్. - హనీఫ్ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి