తను తన బాల్యాన్నంతా ఓ పెట్టెలో కట్టి పెట్టేసింది ఆ పెట్టెకు తనకు ఉన్న చుట్టరికం ఈనాటిది కాదు
నేను నా కవితలన్నింటిని అట్టలూడిన పుస్తకంలో పోగేసుకున్నట్టు తన చిన్ననాటి అనుభవాలన్నింటిని చూడచక్కని ఛాయాచిత్రాలుగా చేసి చక్కగా పోగేసుకుంది తను
నిండు చూలాలు లెక్కున్న ఆ చెక్కపెట్టె పాతదే.. దాని కడుపు నిండా పరుచుకున్న ఆ చిత్రాలు మాత్రం నా కంటికి కొత్త కొత్తగానే కానొస్తున్నాయి
నేనా పెట్టెను పలకరించడం ఇదే మొదటిసారి అందుకే గట్టిగా చుట్టేసుకుందేమో నన్ను ఏదేమైనా.... ఆ పెట్టె ఆమెకు జ్ఞాపకాల పుట్ట ఇప్పుడు నా మనసు చెట్టుకు పట్టిన తీయని తేనెతుట్ట!