అందమైన హారంలో కనిపించని దారం నా దేశం! మాలకట్టే ఈ దారానికి అందరు సమానమే! వర్ణవివక్షతను చూపని ఈ దారం అందరిని ఒకటిగ కలుపుతుంది! కులం కుంపటిని రాజేసేవారిని దూరంగా ఉంచమంటుంది! మతం రంగును పులుముకున్న వారిని పొలిమేర దాటిస్తుంది! ఖద్దరు తొడిగిన నాయకులను గుడ్డిగ నమ్మొద్దంటుంది! ప్రజలను ప్రేమించే వారిని ఎన్నికల్లో గెలిపించమంటుంది! అభివద్ధికి అడ్డుపడే వారిని నలుగురిలో నిలదీయమంటుంది! డబ్బుకు ఆశపడి వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దంటుంది! పేదరికాన్ని రూపుమాపే ప్రణాళికలనే తను ప్రేమిస్తానంటుంది! బడుగు బలహీనుల కోసం నడుము కట్టమంటుంది! లౌకిక వాదమే తన నిజమైన బలమంటుంది! కులమతాలుగ విడిపోతే బలంగా పేనిన దారం తెగిపోతుంది! విడిపోకుండ కలిసుంటే అందమైన పూల హారంగా మిగిలిపోతుంది!!