Sat 21 May 23:06:23.384847 2022 అక్షరానికి వల వేయకు అదే నీకు వలౌతుంది అక్షరాన్ని వంచించకు నిన్నే బలి తీసుకుంటుంది అక్షరాన్ని ఆడించాలనుకోకు నువ్వు ఆటవై పోతావ్ నాగరికతా నట రాజసాలు లౌక్యజీవిత మురికి కూపాలు అక్షరానికి ఆపాదించకు నువ్వు అగడ్త పాలౌతావ్ అక్షరాన్ని ప్రేమించు ఆకాశం కొసపైకెక్కి వానచినుకువై భూమిని ముద్దాడి ఆకు పచ్చగా మొలుస్తావ్ అక్షరాన్ని పూజించు సష్టి మూలాల్ని ఆవాహన చేసుకుని చీకటిని మింగేసిన సూర్యుడై వెలిగిపోతావ్ చేతిలో పట్టుకున్న బహుజన ఖడ్గంతో అహంకార రక్తం అభిషేకించి తలకిందైన చాతుర్వ్యర్ణం మీద సమగీతం ఆలపిస్తావ్ అక్షరాన్ని విశ్వసించు స్వేదవేదం నుండి పొంగివచ్చిన అక్షరాన్ని అంతర్వీక్షించు తిరిగే చక్రానికి రేపటి కన్నువౌతావ్ అక్షర దీపంతో చీకటి కొండపైన ఒంటరిగా నడుస్తూ జీవన యుద్ధంలో నిశ్శబ్దంగా ఒరిగిపో అక్షరమై జీవిస్తావ్.- డాక్టర్. కాంచనపల్లి గోవర్ధన్ రాజు9676096614 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి