పొక్కిలి చేసిన నేల పొత్తిళ్ళలో వీరత్వపు బీజమొకటి మొలకెత్తుతుంది... అణచివేత చర్యలకు అగ్గిపెట్టే ఘడియను కార్మిక శక్తి కాంక్షిస్తున్నది....
పలుగూ పార పదపదమంటున్నది నాగలి కొడవలి సైసై అంటున్నవి కత్తి సుత్తి సమరానికి సైరను ఊదుతున్నవి ఇక చైతన్యం చెందిన కార్మిక శక్తి కదనానికి కాలు దువ్వి కదులుతున్నది...
కాచుకోండిక బడా దోపిడిదారులారా పారిపోండిరా నయా మోసకారులారా దాక్కోండిరా మేక వన్నె పులి వంటి ్్మేధావుల్లా రా ఇక సెమటసుక్కలదే రాజ్యమూ, రాజ్యాధికారమూ...!!