Mon 06 Jun 03:52:04.263214 2022 పుట్టినందుకు కాదు.. మానవత్వం లేనందుకువ్యక్తిగా పెరిగినందుకు కాదు.. పగ, ప్రతీకారం నేర్చినందుకుఎదిగిన యువతలో నేడు.. నైతికత విలువలు కరువైనందుకుసిమాజమా.. సిగ్గుపడుతోటివారు తగువులాడితే... తందానా చూసినందుకుబయటమాత్రం బడాయి మాటలు.. ఇంట్లో మాత్రం కులం కుంపటిస్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం రంగు పూసినందుకుసమాజమా... సిగ్గుపడుమానవత్వం మరిచిపోయి.. అదునుచూసి సంపినందుకుహత్య లాంటి రాక్షస క్రీడకు శిక్షలు లేనందుకుకాపాడమని కాళ్లుమొక్కిన కనికరం లేనందుకు సమాజమా... సిగ్గుపడుదళిత బిడ్డల ప్రేమలకు.. కులం పేరుతో సంపినందుకుప్రేమిస్తే కాదని...పరువు కోసం సంపినందుకుఉన్నోడికి ఒక న్యాయం...లేనోడికి ఒక న్యాయంప్రణరు, నాగరాజు ప్రేమలకు బలైనందుకుసమాజమా... సిగ్గుపడుకంటి ముందు గొడవలైన.. కదలలేని దద్దమ్మలునాకెందుకులే అంటుపోతే.. నవసమాజ నిర్మాణమెలా మనుషులున్న ఈ సమాజం ఇంకెప్పుడు మారును..సమాజంలోని మనుషుల్లారా... మానవత్వం చూపరాఅన్యాయాన్ని ఎదిరించడానికి కదంతొక్కి కదలరా..- లింబూరి లక్ష్మణ్ (తేజ)ఆర్టిస్టు అండ్ జర్నలిస్ట్, బోధన్. నిజామాబాద్ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి