Sun 12 Jun 05:50:38.550611 2022 నిశి మత్తులో'రాత్రి' గురకపెట్టే వేళలోహఠాత్తుగా తలుపుకొడుతున్నగాలి గొంతుకు గది ఉలిక్కిపడింది.వెలుతురుతోకళ్ళు తుడుచుకున్న 'నిద్ర'తలుపు సందు నుండిబయటకు చూసింది.ఆకాశపు చీకటి ఒంటిపైమెరుపు కొరడా దెబ్బలకుగాలి గోగ్గోలు పెడుతూఏదో గాలిసోకినట్లుగా.....ఊర్ల జుట్టుపట్టుకునివీధి తలల్ని తన్నుకుంటూవిసురుగా ఊడ్చుకు ఊగుతూరాత్రి చెవిలోఉరుము చప్పుడుకిచీకటి చెవులు మూసుకుందినింగి కంటిలోమెరుపు సవ్వడికిదిక్కులు కళ్ళు మూసుకున్నాయి.నేల గుండెలదిరితలను ఒడిలో కుక్కొనివణుకుతూ ముడుక్కొంది.నింగి, నేల మధ్య మట్టి ప్రాణాలనితలచి పులకించే ప్రకతి గొంతుకు వంతపాడేగాలి, మెరుపు, ఉరుము, వానలదిఆనాది చుట్టరికమే.కురిసే ప్రేమే వర్షంఅరిసే గొంతు ఉరుముదూకే అడుగే పిడుగుసాచే హస్తం గాలిఅన్నీ బంధువులైన ఈ బంధవ్యమేమట్టిని దీవించే ముసురుకు పునాదిమనిషిని ప్రేమించే ప్రకృతికి అనాది.- శ్రీ సాహితి, 9704437247 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి