Sun 26 Jun 06:36:03.145446 2022
Authorization
కాలేజీ మొదటి రోజు ఏదో
లక్ష్మణరేఖ దాటినట్టు భయంగా
గేటులోపలికి అడుగేసాను
కాస్రూంకి వెళ్తూ తప్పిపోయిన
పసిబిడ్డోలె తెలిసిన మొఖాలు
కనిపిస్తవేమోనని వెతకడం మొదలెట్టాను
అప్పుడే రెక్కలిప్పుకున్న
సీతాకోకచిలుకలా తిరుగుతుంటే
కాలేజీ ఓ పులవనంలా కనిపించింది
మూడు నెలల సెలువుల తర్వాత
మూడు గంటలు క్లాసులో కూర్చోవడం
కత్తి మీద సాములా అనిపించింది
రోజు పొద్దున్నే బస్సు వెనకాల
నా జాగింగ్ మొదలయ్యేది
అలా బస్సెక్కి ఫుట్‌బోర్డుపై నిలబడితే
చల్లటి గాలి ఎదురుగా వచ్చి నుదుటనున్న
చెమటను ముద్దాడి పోయేది
జీవితంలో వెనుకబడుతాను అనుకున్నాడేమో
మా M1 సార్ ఎప్పుడు క్లాస్కొచ్చినా
లాస్ట్ బెంచ్ నుంచి ముందుకు తిస్కొచ్చేటోడు
క్లాస్ బంక్కొట్టి మల్టీప్ల్లేయర్ గేమ్స్ ఆడుతుంటే
ఇంక మిరు మారరా అని అనే M3 మేడం మాటలు
మా లక్ష్యాన్ని గుర్తు చేసేవి
ఎగ్జామ్ హాల్లో వెనుక ఆన్సర్ షీట్‌ను
చూడడం కోసం చేసే ప్రయత్నం
ఏ సర్కస్ ఫీట్‌కు తీసిపోదు
చివరి క్షణంలో చెమటబొట్టు
కంటిరెప్పను పలకరిస్తూ ఆన్సర్ షీట్‌తో చేయి కలపడం
ఇంకా నా కళ్ల ముందే కదులుతుంది
ఎగ్జామ్స్ తర్వాత బావర్చిలో ఫ్రెండ్స్ అందరం కలిసి తిన్న
బిర్యానీ వాసన ఇంకా చేతులకి అలానే ఉంది
అసైన్మెంట్ సబ్మిషన్ రోజు
పెన్ను పేపర్లతో మేమంతా కుస్తిపడుతుంటే
పక్కనోని అసైన్మెంట్ను జిరాక్స్ తీసి సబ్మిట్ చేసే
కష్ణలీలలు మా ఫ్రెండ్ ఒక్కడికే సాధ్యం
ఇస్త్రీ చొక్కా ఏసుకొని చేతికో వాచి తగిలించి
కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యి
లాబ్ ముందు నిల్చునేటోల్లం
వైవాలో అడిగిన క్వశ్చన్లకు
అరుంధతి నక్షత్రం దిక్కు తలలు తిప్పేటోళ్లం
సీనన్నకు గొంతినంగనే మా ఆకలి తెలిసేదేమో
ఫోన్ కొట్టంగనే క్యాంటీన్లో ఎంతపెద్ద లైన్ ఉన్నా
ముందు మాకు ఫ్రైడ్ రైస్ పంపించేటోడు
సాయంకాలం పానీపురి తిని కథాపుస్తకంలో
హాజీరు వేయించుకునేటోళ్లం
C,C++, Java అంటూ
కంప్యూటర్ లాంగ్వేజ్ వెనుక
ఎన్నో పరుగులు తిసాము
GRE,Toefl అంటూ
విమానాన్ని పట్టుకోడానికి జింకపిల్లలెక్క
చంగుచంగుమని మరెన్నో గంతులేసాం
Data structures ఇంకా sql టేబుల్స్‌లో
మా జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచాము
ఫ్రెండ్స్ అందరం భుజాల మీద
చేతులేసికొని తిరిగిన దారులు గుర్తొస్తున్నాయి
ఎంత బాధలో ఉన్నా జోకులేసి
మా పెదాలపై నవ్వుల పూయించిన
మిత్రుడు నిఖిల్ గుర్తొస్తుండు
కాస్రూంలో... మా అల్లరి చూసిన బ్లాక్ బోర్డు
మా ముచ్చట్లను విన్న బెంచీలు గుర్తొస్తున్నాయి
అన్నింటికి మించి...
నాలుగేళ్లు నా ఇల్లైన కాలేజీ గుర్తొస్తుంది
- ఆకాష్ మునిగాల, 8106390647