Sun 26 Jun 06:36:47.019237 2022 మట్టిని కప్పుకునే దేహానికివెచ్చని దుప్పట్లెన్ని కప్పుతావు,చీమలు పీక్కుతినే చర్మానికిరంగులెన్ని పులుముతావు,కట్టెలో కాలే సౌందర్యానికిసొగసులెన్ని అద్దుతావు,కపాలం భళ్ళున పగిలేదానికికిరీటాలెన్ని తొడుగుతావు,మిగిలే ఎముకల గూడుకుభవనాలెన్ని నిర్మిస్తావు,ఊడిపోయే అధికారానికిఅహంకారమెంత చూపుతావు,ఆవిరయ్యే కొవ్వుకుఆహారమెంత అందిస్తావు,ఆయుష్షు పెంచని ఆసుపత్రికిఖర్చులెన్ని వెచ్చిస్తావు,ఆరిపోయే అల్పప్రాణానికిమందులెన్ని చమురుగా పోస్తావు,శాశ్వతం కాదని తెలిసీతహతహలాడతావెందుకు,ఏదీ వెంట రాదని తెలిసీతెగ ఆరాటపడతావెందుకు!- పుట్టి గిరిధర్ 9491493170 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి