Sun 31 Jul 00:05:07.016051 2022 నేను మీ రక్షకుడ్నని మాటల మాయతో నమ్మగొల్పుతావ్మమ్మల్ని ఒంటరిని చేసి నీ వాట్సాప్ యూనివర్సిటీని ఉసిగొల్పుతావుఒళ్ళంతా విషాన్ని నింపుకొని పైకి దేశానికి గొప్ప నటుడ్ని చూపిస్తావ్నువ్వు దేశాన్ని తెగనమ్ముకుంటున్నప్పుడునీ గెలుపుపై నీకు అపనమ్మకం ఏర్పడుతున్నప్పుడు మా గతాన్ని తవ్వి నెత్తుటితో చేతులు శుభ్రపరుచుకుంటావుమా భవిష్యత్తు మీద మా మూలాల మీదమాకే భయంగొలిపేటట్టు చేస్తావునెత్తురు మరిగిన మగానివిపదవితో చల్లారే నీ దాహంనీటితో తీరేది కాదని మాకు తెలియంది కాదు ఓ నరహంతక పాలకుడా !మా ! శిరస్సులే కదరానీ పదవి దాహానికి రక్తమోడీ నైవేద్యాలు.- ఇబ్రహీం నిర్గుణ్ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి