Sun 31 Jul 23:45:35.138623 2022 నిన్నటి వార్తలన్నీ వెతికితే నిజం కానరాలేదని నిప్పు భగ భగ మండుతున్నది.ఎండుకొమ్మ మీద వాలిన పక్షులన్ని చిగురు కోసం ఎదురుచూస్తుంటే ఆకాశంలోమేఘము నవ్వుతున్నది.గాయాలను దాచిన మాటలన్నిగేయాలుగా కదలాడుతుంటేవినలేని హదయాలు గాఢ నిద్రలోకి జారుకున్నాయి.మనుషులే లేని ఇంటిలో గదులన్ని ఖాళీలవుతుంటే ఫుట్ పాత్ పై మెదిలే అనాధలు జీవితతత్వాన్ని మోస్తున్నారు.లేనిచోట కనలేవు వినలేవు ఎన్నటికి కనుగొనలేవు ...నువ్వు కూడా అచ్చం అలాగే నువ్వులేని చోట నిత్యం నీకోసం వెతుకుతూనిన్ను ఎన్నటికి పొందలేవు....- రామ్ పెరుమాండ్ల 9542265831 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి