Sun 04 Sep 01:32:28.245914 2022 అంచనాలు తప్పి,తలపులు తప్పులుగా నిరూపితమయ్యాయి,ఓ అవాంఛనీయం బ్రతుకు మీద కాలేసి తొక్కిపట్టగానేఊహల ఊపిరాగిపోయింది....తేరుకునేలోపే గుప్పిట్లో బంధించిన కాలంవేళ్ళ మధ్యలోంచి నేర్పుగా తప్పించుకుంది.....''తిరస్కారపు వలపు'' ఫ్రస్ట్రేషన్,తాలూకు హ్యాంగోవర్లో,రాత్రి, నడివీధితో కలిసి ఊగుతోంది....''ప్రణయమనంగీకారం'' అనంతరం ఊపిరి కవాటాలు,పొగను నిక్షిప్తపరుచుకునే రహస్య గదులు,మనసేమో నువ్వాడి, ఆడి, విడిచెళ్లిన ఆటబొమ్మ,లిలిలిలిఇసుక తీరంలో మనం కలిసి నడిచిన పాదముద్రల గుర్తులు,కడలి సాక్షిగా అతికించిన ఉమ్మడి వలపు సంతకాలు....ఓర్వలేని అసూయ అలలు,చెదిరిన కాలం కన్న కలలు,గగన సాగరంలో చూపుల వలకు చిక్కిన, నక్షత్ర చేపల్ని లెక్కించిన క్షణాలు,పున్నమి చంద్రుడి సాక్షిగా, వెన్నెల రాత్రుల్లో విహరించిన మధుర గురుతులు.గతించిన జ్ఞాపకాలు,మరుపురాని పురాస్మతులు...లిలిలిలిలిఉన్నట్టుండి ఆ రోజు....ముఖానికేసిన రంగును చెరిపేసుకుని,పోషించిన పాత్ర గురించి ఆరా తీశావు,నా అయోమయ ముఖానికి వెకిలి నవ్వులు గుచ్చుతూ,నాటకం ముగిసిందంటూ వెళ్లిపోయావు...ఆ రోజు,అనేక దిగుళ్లు కమ్మేసిన ఆ రాత్రి,''నువ్వెళ్ళిపోయాక''చినిగిన జంట కాగితపు ఒంటరి వాక్యాన్నై మిగిలాను.....- జాబేర్ పాషా, 00968 78531638 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి