Tue 27 Sep 04:49:05.26895 2022 సృష్టిలోని పూరూపముస్త్రీజాతికి నిజరూపముతెలంగాణ బతుకమ్మప్రకృతిమాత ప్రతిరూపము!బతుకునిచ్చు బతుకమ్మనవరాత్రుల గౌరమ్మతీరు తీరు పువ్వుల్లోనీకు సాటి లేరమ్మ!పూలలోన చేరినావుచైతన్యము నింపినావుతెలంగాణ కోవెలలోబతుకమ్మై వెలిసినావు!పుడమిపైన పూలతల్లిసకల కళల కల్పవల్లితెలంగాణ బింబమైవెలిగెను బతుకమ్మతల్లి!ఊరువాడ ఆటల్లోఉయ్యాలా పాటల్లోఊరెగును బతుకమ్మఉత్సాహపు తోటల్లో!వనంలోన మనంలోనజనజాతర గణంలోనఖ్యాతిగాంచె బతుకమ్మస్వచ్ఛమైన గుణంలోన!అవనిమీద బతుకమ్మఅంతులేని శోభమ్మాఅన్యాయము నెదిరించినబతుకమ్మయె ధీరురాలు!పోరాటము జేసిందికడగండ్లను దాటిందితెలంగాణ వెలుగునంతప్రపంచాన చాటింది!- వడిచర్ల సత్యంసెల్:9441350137 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి