Sun 09 Oct 03:43:09.837318 2022 నన్ను చూసిఅందరూ అదోలా నవ్వుతరునేను నవ్వితే అదోలా చూస్తరు!నవ్విన నాప చేనుఎప్పటికైనా పండక పోదానినే నవ్వుతనే ఉంటా...నవ్వు..నవ్వు నాలుగు తీర్ల చేటైనానలభై తీర్ల మంచైనానువ్వు నవ్వకున్నానే నవ్వుతనే ఉంటా...ఇతరులు నవ్వడానికైనాకోపం తాపం తీర్చడానికైనానేను నవ్వుల పాలైనానే నవ్వుతనే ఉంటా...నేనెంత దుఃఖాన్నితమాయించుకుని నవ్వుతున్నానవ్వెటోని ముందర జారిపడుతున్నానువ్వు గింజ నానేదాకానే నవ్వుతనే ఉంటా...పసిపాప నవ్వులా, పండు వెన్నెల్లాపల్లూడిన అవ్వలా, విరబూసిన పువ్వులాఎగిరే గువ్వలా, ఆడే మువ్వలాజలపాతపు హొరులా, హౌరు గాలిలానే నవ్వుతనే ఉంటా...నువ్వు ప్రేమగా నవ్వే దాకాఅందర్నీ నవ్వించే దాకాదుఃఖం నదిలోనవ్వు నీరు పారేదాకానే నవ్వుతనే ఉంటా...- గంగాపురం శ్రీనివాస్ 9676305949 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి