Sun 09 Oct 03:44:16.68475 2022
Authorization
నేను అతనితో
''నది దగ్గరకు వెళ్దాం పద'' అన్నాను.
అతని కళ్లు ఉదాసీనంగా వున్నా మార్దవంగా వున్నాయి.
అతను భుజాలు ఎగరేసి ''పద'' అన్నాడు.
''నీకు నది అంటే చాలా ఇష్టం...కదా..?''
''భీభత్సమయిన ఇష్టం'' అన్నాను.
నది నా సుదూరపు బాల్యం లాంటిది.
నేను నదీ తీరాలను చూడగలను..
నిట్టూర్పుతో తప్ప
చేతులు చాచి ఆ తీరాలను తాకలేను.
అతను నా పక్కనే నడుస్తూ అన్నాడు
''నీకు చందమామ కూడా ఇష్డం..కదా ?''
''ఇష్టం..చాలా..'' అన్నాను.
''ఇంకా శరత్కాలపు లేతగాలి..?''
''అది కూడా..''
''అలాగే, పౌర్ణమి సమయంలో
అడవిలో తెలియని పూల సువాసన..
మీరు ఒక్కరే ఒంటరిగా ఉన్నారు,
మీకు కొంచెం కూడా భయం వేయదా?''
చెప్పలేని పారవశ్యం
నా తనువుని,మనసుని పులకింపజేస్తుంది.
''దేనికి భయం..?'' అడుగుతాను.
''దయ్యాలకు..?''
''లేదు.నాకు నేనంటేనే భయం''
నవ్వుతూ అప్పుడు, అతను
నా నులివెచ్చని అరచేతిని తాకాడు.
ఈ సమయానికి మేము
నదికి చాలా దగ్గరగా వచ్చాము.
నేను అతని స్పర్శ,వాసనల మత్తులో ఉన్నాను.
ఉన్నట్టుండి అతను నన్ను
వడిగల ప్రవాహం వైపు దారి తీసాడు.
నోట్లో నీళ్లు వదులుతూ..మునుగుతూ,తేలుతూ..
ఆకలితో..నలుగుతూ నేను తడబడుతుంటే -
అతను ఒడ్డు మీద నుంచొని నవ్వుతుంటాడు.
నాకు ఈత రాదనే విషయం
అతని కంటే బాగా తెలిసిన వారెవరున్నారు ?
నేనతనిని ప్రేమిస్తున్నాను.
ఇది నా పాతకమో.. అనుగ్రహమో వదిలేయండి.
ఇది నా హృదయానికి సంతోషమో, దుఃఖమో..
అదలా వుండనివ్వండి.
- తస్లీమా నస్రీన్; ఇంగ్లీషు : అషిమ్ చౌదరి
తెలుగు : పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449