అలుపెరుగని యోధుడా అమరుడా, ఓ రమణ వర్గపోరు ఉన్నంతవరకూ ప్రజా పోరాటాల సారధిగా ప్రజల మదిలో ఉంటావు. అమరుడవైనందుకు అందుకో మా జోహార్లు!!
కార్మిక క్షేత్రం కాగితాల కంపెనీలో ఉద్యోగిగా అడుగు పెట్టి, దారి తప్పి నడుస్తున్న యువతరాన్ని ఉద్యమాలవైపు మలచి, చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదాన్ని, ఊరూరా చేరవేసి యువత మదిలో నింపి, యువజన సంఘాలు పెట్టి దోపిడి వ్యవస్థ పైన తిరుగుబాటు నేర్పి అమరుడవైన ఓ రమణ అందుకో మా జోహార్లు!!
ఆశలు ముఖ్యం కాదు ఆశయాలు ముఖ్యమని నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని ధారబోసి, ఒడిదుడుకులు ఎన్నోచ్చినా.. ఎదురొడ్డి నిలబడి ఉద్యమాలే ఊపిరిగా బ్రతికిన ఓ త్యాగజీవి అందుకో మా జోహర్లు!!
నవశక్తిని, యువశక్తిని కలిపి నడిపి, కార్మిక లోకానికి దిక్సూచిగా నిలిచిన ఓ అక్షర శిల్పి అమరుడా అందుకో మా జోహార్లు !!
నడివయసులో నీవు నడవలేని స్థితిలో ఉన్న, నవతరాన్ని యువతరాన్ని నడిపించుటకు నవ తెలంగాణ పత్రికకు, అక్షరాలు ధారబోసి, తుది శ్వాస విడిచే వరకూ ఉద్యమాలే ఊపిరిగా నడిచిన త్యాగజీవి అందుకో మా జోహార్లు!!
నీవు చూపిన ఆశయాలు నువ్వు నేర్పిన ఉద్యమాలు నీ గమ్యం చేరేవరకూ మరవమని మాటిస్తూ మరోమారు తెలుపుతున్నం.. అమరుడా ఓ రమణ అందుకో మా జోహార్లు!!