Sun 20 Nov 01:21:40.825366 2022
Authorization
తెలుగు సినిమాని
సింహాసనం ఎక్కించిన సూపర్ స్టార్
అల్లూరి సినిమాతో
జాతీయ స్పూర్తిని తెరకెక్కించి
స్వాతంత్య్ర పౌరుషాన్ని నింపిన సీతారామరాజు
లీడర్ గా ఈనాడు ,
కార్మికునిగా రిక్షావాలా
తొలి కౌబాయి జేమ్స్ బాండ్‌గా
మోసగాళ్ళకు మోసగాడు
ముందడుగు,పచ్చని కాపురం
ఉత్తమ చిత్రాలనందించిన
కథానాయకుడు
తేనెమనుషులుతో మొఖానికి రంగేసి
తొలి 70ఎఎ
సీనిస్కోపులతో రంగుల చిత్రాలను
నేలమీద నాటిన తొలి హీరో
కార్మిక కర్షకుల కోసం కంచుకాగడై
రైతులకోసం రైతుభారతమై
సామాన్యుల జీవితాలను ఆవిష్కరించిన గాజుల కిష్టయ్య
చెరువు ఒడ్డున బట్టలుతికి
సామాజిక కులాలను
గౌరవించిన కన్నె మనసుల బండోడు గుండమ్మ!
పేదలను ఆదుకున్న అగ్నిపర్వతం
ప్రతీకారాన్ని రగిలించిన ఖైదీరుద్రయ్య
బూజుపట్టిన రాజకీయాలను ఎదిరించిన ప్రజాప్రతినిది
నల్లకోటుకు న్యాయం చేసిన గుండారాజ్యం
ప్రజానాట్యమండలిలో నాటకమయ్యాడు
సోషల్ కాన్సెప్ట్‌లో
ఎన్నేన్నో బాధ్యతల చిత్రాల పద్మభూషణ్
దేవుడు చేసిన మనుషులు
గురు శిష్యులు
శ్రీశ్రీ సోషల్ విప్లవ విభిన్న పాత్రలకు
జీవం పోసిన తొలితరం మహా నటుడు
సాహసమే నా ఊపిరని నినదించాడు
సీనిమారంగంలో తనదే రహదారి !
ప్రకృతి విపత్తులకు
పేదలనాదుకున్న తొలి చెయి
సహాయం ఆయన మొదటి తత్వం
డేరింగ్ డ్యాషింగ్ లతో
ఉత్తమ కుటుంబ కథాచిత్రాలు
సామాజిక స్పృహనే తన బాధ్యత నటనగా
సీనిరంగాన్నేలిన నటశిఖరం
ఒక దేవుడు
నా యింట్లో దీపం వెలిగించాడు
ఆ దేవుడే ఆదుర్తి సుబ్బారావని నిజాయితి చాటిన నిగర్వి
ఏ సాయాన్ని మరువని కృతజ్ఞుడు!
దర్శకులను, నిర్మాతలను,ఆర్టిస్టులను
సొంతబిడ్డల్లా చూసుకున్న మహామనిషి
తెలుగు సినిమాను నడిపించిన చూపుడువేలు
తారా లోకంలో వెలుగు
వేనవేల యేండ్లు!!!
సముద్రమంత సహృదయుత హృదయశీలి
సంస్కార వినయుడు
నటశేఖరం కృష్ణకు నివాళులు
- వనపట్ల సుబ్బయ్య, 9492765358