Sun 27 Nov 01:37:50.220422 2022 నిత్యం మనసు లోలోన మాటాడుతోందిమనాది గుండెను మెలిపెడుతోందిబతుకుబాట భారమై సాగుతూందిబాధ్యత మాత్రం లబ్ డబ్ మని ధ్వనిస్తోంది...కడుపులో దుఃఖం రెట్టింపు అవుతోందితీరని బాధ గుండెని కప్పేస్తోందికనుల నిండా కన్నీరు ఉబుకుతోందిఅమ్మ... అమ్మ ఇక కనిపించకుంది...కళ్ళనిండిన కన్నీరు ఇగిరిపోతోందిఆకాశంలో దుఃఖ మేఘం ఆవరిస్తోందిహృదయ వేదన తిరిగి కన్నీరు వర్షిస్తోందిఅమ్మ... అమ్మ ఇకనుండి కనిపించనంది...నుదుటిగీత చదవాలనే తపనైతే వుందిబ్రహ్మ లిఖితం మార్చడం అసాధ్యమేనందిఅంతరిక్షం దాటి ఓ ఆశీర్వచన మంత్రంనిత్యం వినవస్తోందివీడిన మాతృఛాయ వెన్నంటే వుంది?గుండెతడి ఆత్మీయ స్పర్శకి నోచుకుంటుందా?మనసు రోదన దిగంతాల కావల చేరుకుంటుందా?నిజంగా నా మాటనకడ వినపిస్తోందా?''అమ్మా... ఎట్లున్నవే''?- అశోక్ గుంటుక, 9908144099 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి