Sun 25 Dec 01:01:10.497406 2022 మబ్బుల్ని ఎవరో మూటగట్టిమీదికి ఇసురుతున్నట్లునీడను వెంబడించినెట్టింట్లోకి నెట్టేస్తున్నట్లుకాలికింద రేణువులనుడాలర్లలో కొనేస్తున్నట్లుఎదను అగాధంలోకిబలవంతంగా లాగుతున్నట్లునిలుచుందామంటేచేతులు నేలపై ఆనుతున్నట్లునడుద్దామంటేకాళ్ళు ఆకాశాన్ని ముద్ధాడుతున్నట్లుఆలోచనల్ని ఆఫ్ చేసిఅంతర్జాలంలో హ్యాక్ చేసినట్లుమనసు మాటలనుఇన్బాక్స్ లో స్టోర్ చేసిఇన్ స్టాగ్రామ్ కి ఫార్వర్డ్ చేస్తున్నట్లుఅనుమానమనే వైరసేదోఊపిరిని స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లువైరస్ ను స్మాష్ చేసేఫార్మాట్ ను అప్డేట్ చేసిబాడీలోకి ఇన్స్టాల్ చేసుకుందాం..!!- ముక్కాముల జానకీరామ్ 6305393291 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి