Sun 15 Jan 00:52:10.393501 2023 నరమేధం జరగలేదక్కడరక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.కత్తులు దూసింది లేనే లేదెక్కడ.యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనేసమ సమాజం స్థాపించాలనే సంకల్పంతోలిఖించ బడుతున్న అక్షరం సృష్టిస్తున్నచరిత్రకు శ్రీకారం ప్రజ్వరిల్లుతుందక్కడనవశకానికి నాంది పలుకుతుందక్కడ..కుహానా నాయకుల కుయుక్తులుదోపిడీ వ్యవస్థ పునాదులు తెగిపడుతున్నారు.తరతరాలుగా సాగుతున్నఅనుభవిస్తున్న అధికారం, అంగబలంఒక్క సిరాచుక్క సృష్టిస్తున్న సునామీలోకొట్టుకుపోతున్నారు.సిరా చుక్కలో పురుడోసుకున్న అక్షరంతోజన జాగృతి నడికట్టు బిగిస్తుంది.దొరలకు దాసోహమంటూ మ్రోక్కిన చేతులు..పిడికి బిగించి అక్షర భావాలను విను వీధుల్లోప్రతిధ్వనింప చేస్తుంటే..నిరాశా నిస్పృహలతోనిత్యం ఎదలో సంఘర్షణలతో తల్లడిల్లినపేదవాని అధరాలు చిరునవ్వులు చిందిస్తున్నారు.అక్షరమే ఆయుధంగా కవి సమాజంలోనిరుగ్మతలపై సమర శంఖారావం పూరిస్తుంటే.- రాము కోలా, 9849001201 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి